Thursday, April 3, 2025

ముడా స్కామ్‌లో కర్నాటక సిఎంకు ఎదురుదెబ్బ..

- Advertisement -
- Advertisement -

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతికి ఇచ్చిన క్లీన్ చిట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సవాలు చేసింది. ఈ కేసులో బుధవారం ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లోకాయుక్త నివేదికను తిరస్కరించి, ఈ కేసుపై దర్యాప్తు కొనసాగించడానికి అనుమతించాలని ఏజెన్సీ కోర్టును కోరింది.

లోకాయుక్త గతంలో ఈ కేసుకు సంబంధించి తగినంత సాక్ష్యాలు లేవని.. ఈ కేసును సివిల్ స్వభావం గలదిగా పరిగణించాలని, ఇందులో తదుపరి నేర దర్యాప్తు అవసరం లేదని ఫిబ్రవరిలో ముగింపు నివేదికను కోర్టుకు సమర్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News