Monday, December 23, 2024

మాగుంట రాఘవకు కు తాత్కాలిక బెయిల్‌పై సుప్రీంలో ఇడి పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసు నిందితుడు మాగుంట రాఘవ రెడ్డికి 15 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం ఎదుట అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అత్యవసరంగా ఈ కేసు విచారణ చేపట్టాలని అర్థించారు. రాఘవ రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక సిబిఐ కోర్టు తిరస్కరించిందని, భార్య అనారోగ్యాన్ని కారణంగా చెబుతూ దాఖలు చేసిన మరో బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేయడంతో హైకోర్టులో ఈ పిటిషన్‌ను ఉపసంహించుకున్నారని రాజు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

ఇడి పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టడానికి ధర్మాసనం అంగీకరించింది. అవతలి పక్షం వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్‌పై స్టే ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది.
=========

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News