Sunday, December 22, 2024

కవిత ఎ-32

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇడి తాజా చార్జ్ షీట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితపై అభియోగాలు ఇడి నమోదు చేసింది. మే 10న కవిత పై చార్జ్ షీట్ దాఖలు చేసిన ఇడి 8364 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత పాత్ర ఉందని, బుచ్చిబాబు కవిత పాత్ర పై వాంగ్మూలమిచ్చారు ఆ తర్వాత కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని కవిత బుచ్చిబాబుపై ఒత్తిడి చేసిందని ఇడి వెల్లడించింది. అరుణ్ రామ్ చంద్ర పిళ్లయి ఇచ్చిన స్టేట్మెంట్లను కవిత ఒత్తిడి మేరకే వెనక్కి తీసుకునేందుకు రిట్రాక్ట్ పిటిషన్ వేశారని ఇడి పేర్కొంది. అయితే తాజా చార్జిషీట్‌ను స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ సందర్భంగా కవితపై త్వరితగతిన ట్రయల్ ప్రారంభించాలని, ఆమె ఆస్తులు జప్తు చేయాలని ఇడి కోర్టును కోరింది. కవితపై అభియోగాలు నమోదు చేసిన ఇడి రూ.1100 కోట్ల రూపాయల నేరం జరిగిందని వెల్లడించింది.

రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్ పొందిందని పేర్కొంది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఇడి అధికారులు వెల్లడించారు. రూ.292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని వెల్లడించింది. ఇడి. పిఎంఎల్‌ఎ సెక్షన్స్ 44, 45 కింద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన ఇడి. పిఎంఎల్‌ఎ సెక్షన్ 17 ప్రకారం తెలంగాణ, ఢిల్లీ, ఎపి, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, తమిళనాడు ఇతర ప్రాంతాల్లోని 24 స్థానాల్లో సోదాలు నిర్వహించామని పేర్కొంది. ఇప్పటివరకు లిక్కర్ స్కాంలో 18 మందిని అరెస్ట్ చేసినట్లు ఇడి వెల్లడించింది. ఈ కేసులో బెయిల్ పై ఉన్న శరత్ చంద్రా రెడ్డిని ఎ7గా, రాఘవ మాగుంటను ఏ18గా, ఏ32గా కవిత పేరును ఇడి పేర్కొంది. మొత్తం 49 మందిని ఇడి అధికారులు విచారించారు. పిఎంఎల్‌ఎ సెక్షన్ 50(2), (3) ప్రకారం కవిత, మాగుంట శ్రీనివాసులు, రాఘవ మాగుంట, గోపి కుమరన్,, శరత్ చంద్రా రెడ్డి, సమీర్ మహేంద్రు, దినేశ్ అరోరా, అరుణ్ పిళ్లై, వి. శ్రీనివాస్ ఇతరుల వాంగ్మూలాల రికార్డు చేసినట్లు ఇడి వెల్లడించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు వెనక పలుసార్లు విజయ్ నాయర్‌తో కవిత సమావేశం అయ్యారని, సౌత్ గ్రూపు వచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందని ఇడి పేర్కొంది. ఇండో స్పిరిట్ కంపెనీలో సౌత్ గ్రూప్ 65 శాతం వాటా అని, కవిత పాత్రపై ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలాలను చార్జ్ షీట్లో ఇడి వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం సంబంధించి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాలతో కవిత సంభాషణలు జరిపిందని, లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ కు కోఆర్డినేటర్‌గా వ్యవహరించాడని, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆధారాలను ధ్వంసం చేసింది అంటూ ప్రత్యేకంగా ఇడి పేర్కొంది. విచారణ సందర్భంగా కవిత తప్పుడు సమాచారం ఇచ్చారని, 9 ఫోన్‌లను ఇడికి కవిత ఇచ్చారు. ఈ క్రమంలో పొలిటికల్ షో చేసిందని ఇడి వెల్లడించింది.

ఈడి చార్జిషీట్ లో కవిత స్టేట్మెంట్
‘లిక్కర్ పాలసీ రూపకల్పనలో నా తరపున పాల్గొనాలని బుచ్చిబాబుకి నేను ఎలాంటి అథరైజేషన్ ఇవ్వలేదు. ఇండో స్పిరిట్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు ఎలాంటి వాటా లేదు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి నేను ఎవరితో మాట్లాడలేదు. బుచ్చిబాబు, రాఘవల మధ్య జరిగిన సంభాషణలు చూపిస్తే నాకు గుర్తులేదు, వాళ్ళ నెంబర్లు కూడా తెల్వదు. లిక్కర్ పాలసీ రూపకల్పన, లిక్కర్ వ్యాపారం నాకు సంబంధం లేదు, నా తరపున ఎవరు ఆప్‌ను సంప్రదించలేదు, లంచాలు ఇవ్వలేదు. అరుణ్ పిళ్ళై నా ఫామిలీ ఫ్రెండ్, వీకేండ్లలో తరచు కలుస్తుంటాం, బతుకమ్మ లాంటివి కలిసి నిర్వహించాం. అరుణ్ పిళ్ళై ఇచ్చిన స్టేట్మెంట్‌లను కవిత నిరాకరించింది. అరుణ్ పిళ్ళై సమీర్ మహేంద్రును హైదరాబాద్ లో కవితకు పరిచయం చేశాడు. సమీర్ మహేంద్రుతో మాట్లాడిన విషయం గుర్తు లేదన్న కవిత, ఇండో స్పిరిట్‌లో అరుణ్ పిళ్ళై నా తరపున కార్యకలాపాలు నిర్వహించలేదు. ఇండియా హెడ్ న్యూస్ ఛానల్‌లో అభిషేక్‌కు వాటాలు ఉన్న సంగతి నాకు తెలియదు. ఇండియా హెడ్ ఛానల్ లో పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ ముత్త నన్ను కోరినా ఇంట్రస్ట్ లేదని చెప్పాను. మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని అనేక సందర్భాలలో కలిశాను, కానీ మాగుంట రాఘవరెడ్డిని ఒక్కసారి మాత్రమే కలిశాను.’

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు –
జులై 3వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా నెల రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత రిమాండ్ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా, రౌస్ అవెన్యూ కోర్టు ఇడి కేసులో కవితకు జులై 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో కవిత పాత్రపై ఇడి సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమెకు, చరణ్‌ప్రీత్‌లకు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. మిగిలిన ఇద్దరు నిందితులను కోర్టు ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఇప్పటి వరకు 14 రోజులు మాత్రమే రిమాండ్ పొడిగిస్తూ రాగా, ఈసారి ఏకంగా నెల రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సిబిఐ కేసులోనూ సోమవారంతో కవిత కస్టడీ ముగియగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కవితను జడ్జి ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఈ నెల 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జూన్ 7న సిబిఐ కవితపై ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.

ఈ కేసుకు సంబంధించి మార్చి 26వ తేదీ నుంచి కవిత తీహార్ జైళ్లో ఉన్న సంగతి విదితమే.బుచ్చిబాబుపై ఒత్తిడి చేసిందని ఇడి వెల్లడించింది. అరుణ్ రామ్ చంద్ర పిళ్లయి ఇచ్చిన స్టేట్మెంట్లను కవిత ఒత్తిడి మేరకే వెనక్కి తీసుకునేందుకు రిట్రాక్ట్ పిటిషన్ వేశారని ఇడి పేర్కొంది. అయితే తాజా చార్జిషీట్‌ను స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ సందర్భంగా కవితపై త్వరితగతిన ట్రయల్ ప్రారంభించాలని, ఆమె ఆస్తులు జప్తు చేయాలని ఇడి కోర్టును కోరింది. కవితపై అభియోగాలు నమోదు చేసిన ఇడి రూ.1100 కోట్ల రూపాయల నేరం జరిగిందని వెల్లడించింది. రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్ పొందిందని పేర్కొంది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఇడి అధికారులు వెల్లడించారు. రూ.292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని వెల్లడించింది. ఇడి. పిఎంఎల్‌ఎ సెక్షన్స్ 44, 45 కింద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన ఇడి. పిఎంఎల్‌ఎ సెక్షన్ 17 ప్రకారం తెలంగాణ, ఢిల్లీ, ఎపి, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, తమిళనాడు ఇతర ప్రాంతాల్లోని 24 స్థానాల్లో సోదాలు నిర్వహించామని పేర్కొంది. ఇప్పటివరకు లిక్కర్ స్కాంలో 18 మందిని అరెస్ట్ చేసినట్లు ఇడి వెల్లడించింది.

ఈ కేసులో బెయిల్ పై ఉన్న శరత్ చంద్రా రెడ్డిని ఎ7గా, రాఘవ మాగుంటను ఏ18గా, ఏ32గా కవిత పేరును ఇడి పేర్కొంది. మొత్తం 49 మందిని ఇడి అధికారులు విచారించారు. పిఎంఎల్‌ఎ సెక్షన్ 50(2), (3) ప్రకారం కవిత, మాగుంట శ్రీనివాసులు, రాఘవ మాగుంట, గోపి కుమరన్,, శరత్ చంద్రా రెడ్డి, సమీర్ మహేంద్రు, దినేశ్ అరోరా, అరుణ్ పిళ్లై, వి. శ్రీనివాస్ ఇతరుల వాంగ్మూలాల రికార్డు చేసినట్లు ఇడి వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు వెనక పలుసార్లు విజయ్ నాయర్‌తో కవిత సమావేశం అయ్యారని, సౌత్ గ్రూపు వచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందని ఇడి పేర్కొంది. ఇండో స్పిరిట్ కంపెనీలో సౌత్ గ్రూప్ 65 శాతం వాటా అని, కవిత పాత్రపై ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలాలను చార్జ్ షీట్లో ఇడి వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం సంబంధించి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాలతో కవిత సంభాషణలు జరిపిందని, లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ కు కోఆర్డినేటర్‌గా వ్యవహరించాడని, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆధారాలను ధ్వంసం చేసింది అంటూ ప్రత్యేకంగా ఇడి పేర్కొంది. విచారణ సందర్భంగా కవిత తప్పుడు సమాచారం ఇచ్చారని, 9 ఫోన్‌లను ఇడికి కవిత ఇచ్చారు. ఈ క్రమంలో పొలిటికల్ షో చేసిందని ఇడి వెల్లడించింది.

ఈడి చార్జిషీట్ లో కవిత స్టేట్మెంట్
‘లిక్కర్ పాలసీ రూపకల్పనలో నా తరపున పాల్గొనాలని బుచ్చిబాబుకి నేను ఎలాంటి అథరైజేషన్ ఇవ్వలేదు. ఇండో స్పిరిట్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు ఎలాంటి వాటా లేదు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి నేను ఎవరితో మాట్లాడలేదు. బుచ్చిబాబు, రాఘవల మధ్య జరిగిన సంభాషణలు చూపిస్తే నాకు గుర్తులేదు, వాళ్ళ నెంబర్లు కూడా తెల్వదు. లిక్కర్ పాలసీ రూపకల్పన, లిక్కర్ వ్యాపారం నాకు సంబంధం లేదు, నా తరపున ఎవరు ఆప్‌ను సంప్రదించలేదు, లంచాలు ఇవ్వలేదు. అరుణ్ పిళ్ళై నా ఫామిలీ ఫ్రెండ్, వీకేండ్లలో తరచు కలుస్తుంటాం, బతుకమ్మ లాంటివి కలిసి నిర్వహించాం. అరుణ్ పిళ్ళై ఇచ్చిన స్టేట్మెంట్‌లను కవిత నిరాకరించింది. అరుణ్ పిళ్ళై సమీర్ మహేంద్రును హైదరాబాద్ లో కవితకు పరిచయం చేశాడు. సమీర్ మహేంద్రుతో మాట్లాడిన విషయం గుర్తు లేదన్న కవిత, ఇండో స్పిరిట్‌లో అరుణ్ పిళ్ళై నా తరపున కార్యకలాపాలు నిర్వహించలేదు. ఇండియా హెడ్ న్యూస్ ఛానల్‌లో అభిషేక్‌కు వాటాలు ఉన్న సంగతి నాకు తెలియదు. ఇండియా హెడ్ ఛానల్ లో పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ ముత్త నన్ను కోరినా ఇంట్రస్ట్ లేదని చెప్పాను. మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని అనేక సందర్భాలలో కలిశాను, కానీ మాగుంట రాఘవరెడ్డిని ఒక్కసారి మాత్రమే కలిశాను.’

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు –
జులై 3వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా నెల రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత రిమాండ్ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా, రౌస్ అవెన్యూ కోర్టు ఇడి కేసులో కవితకు జులై 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో కవిత పాత్రపై ఇడి సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమెకు, చరణ్‌ప్రీత్‌లకు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. మిగిలిన ఇద్దరు నిందితులను కోర్టు ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఇప్పటి వరకు 14 రోజులు మాత్రమే రిమాండ్ పొడిగిస్తూ రాగా, ఈసారి ఏకంగా నెల రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సిబిఐ కేసులోనూ సోమవారంతో కవిత కస్టడీ ముగియగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కవితను జడ్జి ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఈ నెల 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జూన్ 7న సిబిఐ కవితపై ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ కేసుకు సంబంధించి మార్చి 26వ తేదీ నుంచి కవిత తీహార్ జైళ్లో ఉన్న సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News