Friday, November 15, 2024

ఇడి డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాకు ఇచ్చిన పదవీకాలం పొడిగింపును చట్టవిరుద్ధంగా సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. ఆయన పదవీకాలం పొడిగింపును సుప్రీంకోర్టు గతంలో వ్యతిరేకించిన నేపథ్యంలో మరోసారి పదవీ కాలాన్ని పొడిగించడం చెల్లదని, ఇది చటవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే మివ్రా 2023 జులై 31వ తేదీవరకు ఆ పదవిలో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించడానికి వీలుకల్పిస్తూ తీసుకువచ్చిన 2021 నాటి కేంద్ర విజిలెన్స్ కమిషన్(సవరణ) చట్టం చట్టబద్ధతను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. చట్ట సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు ఉందని, ఈ చర్యలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏదీ జరగలేదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర విజిలెన్స కమిషన్(సవరణ) చట్టం, 2021, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్(సవరణ) ఆర్డినెన్సు, 2021, కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ 2021 నవంబర్ 15న జారీచేసిన నోటిఫికేషన్ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News