Thursday, January 23, 2025

దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

Indus Viva company representatives involved in Rs 1500 crore scam
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఇడి సోదాలు చేస్తుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, పంజాబ్, బెంగళూరు వంటి ప్రాంతాలలో ఇడి సోదాలు కొనసాగుతున్నాయి. ఇడి అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్ర ఇచ్చి సమాచారంతోనే సోదాలు చేస్తుంది. ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియా ముఖ్య అనుచరుడు ఇంట్లో ఇడి సోదాలు నిర్వహిస్తోంది. దినేష్ అరోరా ఇల్లు ఆఫీసుతో పాటు స్నేహితుల ఇళ్లలో కూడా ఇడి సోదాలు చేపడుతోంది. దినేష్ ఆరోరాకు చెందిన అకౌంట్‌లోకి కోటి రూపాయల నగదు బదిలీ అయ్యింది. రాధాకృష్ణ ఇండస్ట్రీ ద్వారా దినేష్ అరోరా యూకో బ్యాంక్‌లోకి నగదు బదిలీ అయ్యింది. కోటి రూపాయల నగదును సమీర్ మహేంద్రుడు బదిలీ చేశారు. ఇప్పటికే దినేష్ అరోరాపై సిబిఐ కేసు నమోదు చేశారు. దినేష్ అరోరా డబ్బులను మనీష్ సిసోడియా ఇచ్చినట్లు ఇడి గుర్తించింది. సమీర్ మహేంద్ర, అర్జున్ పాండే, విజయ్ నాయర్, రామచంద్రపిళ్లైలకు ఐదు కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసినట్లు ఇడి గుర్తించింది. ఇడి కస్టడీలో ఉన్న సమీర్ మహేంద్రు స్టేట్‌మెంట్‌తో ఇడి సోదాలు చేపడుతోంది. హైదరాబాద్‌లో రెండో చోట్ల ఇడి అధికారులు సోదాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News