Thursday, January 23, 2025

మహారాష్ట్ర మంత్రి అనిల్ పరబ్ ఇంట్లో ఈడీ సోదాలు

- Advertisement -
- Advertisement -

ED conducts searches in Maharashtra Minister Anil Parab

ముంబై : మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఓ మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అనిల్ నివాసంతోపాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ ఏక కాలంతో ఈ సోదాలు జరిగాయి. రత్నగిరి జిల్లా లోని దాపోలీ తీర ప్రాంతంలో ఓ భూమి కొనుగోలు ఒప్పందంలో అనిల్ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈడీ ఆయనపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. 2017 లో అనిల్ దాపోలీ ప్రాంతంలో ఓ భూమిని రూ. కోటికి కొనుగోలు చేశారు. దాన్ని 2019 లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత 2020 లో ముంబైకి చెందిన కేబుల్ ఆపరేటర్ సదానంద్ కడమ్‌కు రూ. 1.10 కోట్లకు ఆ భూమిని విక్రయించారు.

అయితే 2017 20 మధ్య ఆ భూమిలో పరబ్ తన బిజినెస్ భాగస్వామి సదానంద్‌తో కలిసి నిబంధనలకు వ్యతిరేకంగా ఓ రిసార్ట్‌ను నిర్మించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐటీ శాఖ గతంలో విచారణ జరపగా, ఆ రిసార్ట్ నిర్మాణం కోసం రూ. 6 కోట్లకు పైగా నగదునను వెచ్చించారని, అదంతా లెక్కల్లో చూపని డబ్బేనని తేలింది. దీంతో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో గతేడాది ఈడీ అనిల్ పరబ్‌ను విచారించింది. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లభించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News