Sunday, January 12, 2025

ఈడి విచారణకు కవిత గైర్హాజరు.. అరుణ్ పిళ్లైకి కస్టడీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరుణ్ రామచంద్రపిళ్లైకి మూడు రోజుల పాటు కోర్టు కస్టడీని పొడిగింది. కస్టడీని పొడిగించాలని ఈడి కోరడంతో కోర్టు అంగీకరించింది. ఈ కేసులో కవితను అరుణ్ రామచంద్రపిళ్లైను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని ఈడి అధికారులు కోర్టుకు తెలిపారు. అందరిని కలిపి విచారిస్తే ఎలా అని కోర్టు ప్రశ్నించింది.

లిక్కర్ స్కాంలో కవితను అనుమానితురాలిగా ఈడి అధికారులు కోర్టుకు తెలిపారు. గురువారం విచారణకు కవిత హజరు కాలేదని అధికారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కవితతో కలిపి విచారణ చేయాల్సి ఉన్నందున అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని పెంచాలని కోర్టును కోరారు. కోర్టు సానుకూలంగా స్పందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News