Monday, December 23, 2024

టాలీవుడ్ డ్రగ్స్ పై ఇడి లోతుగా దర్యాప్తు….

- Advertisement -
- Advertisement -

ED letter Excise branch in Tollywood drug case

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ పై ఇడి లోతుగా దర్యాప్తు జరుపుతోంది.  2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆడియో విడియో రికార్డ్ ను మాయం చేశారు. 2017 లో టాలీవుడ్ స్టార్స్ తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటాను ఎక్సైజ్ శాఖ రికార్డు చేసింది. వీరిపై 2017 లో 12 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయగా  డ్రగ్స్ నిందితుల తో పాటు సాక్షుల నుంచి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఈడి కి ఎక్సైజ్ ఎస్ పి శ్రీనివాస్ తెలిపారు. విచారణ సందర్భంగా అందరి కాల్ డేటా రికార్డ్ నమోదు చేసింది. నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్ ను సైతం సీజ్ చేశామని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. కెల్విన్ తో స్టార్స్ కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ బయటికి తీసింది. ఆ కాల్ డేటా రికార్డ్ ను ఎక్సైజ్ శాఖ ఇడికి మాత్రం ఇవ్వలేదు.  ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ ల తో పాటు, ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్ ను ఇవ్వాలని ఇడి కోరింది. కేసు వివరాలు ట్రైల్ కోర్ట్ లో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కోర్టుకు ఎక్సైజ్ శాఖ సమర్పించిన వాంగ్మూల కాపీలు మాత్రమే అందాయని ఇడి పేర్కొంది. అందులో కాల్ డేటా రికార్డింగ్స్ లేవు అని ఇడి కోర్టుకు విన్నవించింది. వాటిని ఇవ్వాలని కొన్ని రోజుల క్రితమే ఎక్సైజ్ శాఖకు ఇడి లేఖ రాసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News