Friday, November 15, 2024

పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడి

- Advertisement -
Sanjay Raut
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, నాలుగుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సంజయ్ రౌత్‌ను రూ. 1,034 కోట్ల పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం అదుపులోకి తీసుకుంది. 60 ఏళ్ల జర్నలిస్ట్-రాజకీయవేత్త  అయిన ఆయన బిజెపిని తీవ్రంగా విమర్శించే వారిలో ఒకరు.  మహా వికాస్ అఘాడి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినప్పటి నుండి ఈడి ప్రకోపాన్ని ఎదుర్కొంటున్నారు.
ముంబయిలోని సెంట్రల్ సబర్బన్‌లోని భాండూప్‌లో ఉన్న అతని మైత్రీ బంగ్లాలో దాదాపు డజను మంది ఈడి అధికారులు మరియు సిబ్బంది సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకునే ముందు తొమ్మిది గంటల పాటు విచారించారు. రౌత్ ను ఇప్పుడు బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఈడి కార్యాలయానికి తీసుకువెళుతున్నారు. రౌత్ నివాసం మరియు ఈడి కార్యాలయం వెలుపల బలమైన పోలీసు సిబ్బందిని మోహరించారు. రౌత్‌ సోదరుడు సునీల్‌ రౌత్‌,  ఆయనను అరెస్టు చేయలేదని చెప్పారు. “రౌత్ సాహెబ్‌ని అరెస్ట్ చేయలేదు, ఇడి ఆఫీసుకి తీసుకెళ్తున్నారు….మేమంతా అక్కడికి వెళ్తున్నాం.. ఏం జరుగుతుందో చూద్దాం” అన్నాడు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News