లక్నో: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్‌ను బిజేపీ ఎన్నికల బరిలోకి దింపింది. స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన రాజేశ్వర్ సింగ్ సరోజినీ నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ డీల్ కేసులో కార్తీ చిదంబరం , ఆయన తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం లను రాజేశ్వర్ సింగ్ విచారించారు. రాజేశ్వర్ సింగ్ ఈడీ నుంచి మాతృసంస్థ అయిన బీజేపీ లోకి చేరారని కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. యూపీఎ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ అవినీతి కేసుల దర్యాప్తులో రాజేశ్వర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. యోగి ఆదిత్యనాధ్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న స్వాతి సింగ్ స్థానంలో ఈయనను బిజేపి రంగం లోకి దింపింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ సింగ్ మాట్లాడుతూఏ తాను పాలనను మెరుగుపరుస్తానని, మాఫియాలకు వ్యతిరేకంగా తన పనిని కొనసాగిస్తానని చెప్పారు.