Monday, December 23, 2024

టిఎస్ పిఎస్ సి పేపర్ లీకేజి కేసులో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ పిఎస్ సి పేపర్ లీకేజి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. శంకరలక్ష్మీ పై ఈడీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.కాన్ఫిడెని్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రం లీకైనట్లు ఈడీ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. శంకరలక్ష్మీతో పాటు కమిషన్ కు చెందిన సత్యనారాయణ కు ఈడీ నోటీసులు పంపించింది.బుధ, గురువారాల్లో విచారణకు హాజరఉ కావాలని నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్ , రాజశేఖర్ ను కస్టడీకి తీసుకొని విచారించనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

టిఎస్ పిఎస్ సి కేసు దర్యాప్తు నివేదికను సిట్ అధికారులు హైకోర్టుకు సమర్పించనున్నారు. ప్రశ్నపత్రాల లీక్ కేసును నెల రోజుల పాటు దర్యాప్తు చేసిన సిట్ నివేదికలో టిఎస్ పిఎస్ సి ఛైర్మన్ వాంగ్మూలం పొందుపరిచింది.అలాగే టిఎస్ పిఎస్ సి సెక్రటరీ, సభ్యుడి వాంగ్మూలాలు నమోదు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితులుగా ప్రవీణ్, రాజశేఖర్ , డాక్యా నాయక్ దర్యాప్తు నివేదికలో జతపర్చారు. నిందితుల పెన్ డ్రైవ్, మొబైల్స్లో ప్రశ్న పత్రాలు ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో సిట్ అధికారులు పొందుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News