Sunday, December 29, 2024

ఆప్ ఎంపి సంజయ్ సింగ్‌పై ఇడి మరో చార్జీషీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సంచలనాత్మక ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆప్ ఎంపి సంజయ్ సింగ్‌పై ఛార్జీషిట్ దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ సంబంధిత ఆర్థిక అక్రమ వ్యవహారాల కేసులో సంజయ్ సింగ్‌పై శనివారం 60 పేజీల అభియోగపత్రం నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాసిక్యూషన్ స్థాయి ఫిర్యాదును స్థానిక న్యాయస్థానంలో పిఎంఎల్‌ఎ పరిధిలోని పలు సెక్షన్ల మేరకు పొందుపర్చారు. ఇంతకు ముందు ఇడి ఈ కేసులో సింగ్‌పై ఐదు ఇటువంటి ఛార్జీషీట్లు వేసింది. ఇప్పుడు దీనికి అనుబంధ ఛార్జీషీట్ దాఖలు చేసింది. రాజ్యసభ సభ్యులైన సంజయ్‌సింగ్ లిక్కర్ స్కామ్‌లో అక్టోబర్‌లో అరెస్టు అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News