నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు
మరి కొందరు కాంగ్రెస్ నేతలపైనా ఛార్జిషీట్ ఈ నెల 25న విచారణ
చేపట్టనున్న రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే ఆస్తుల జప్తు ప్రక్రియ
ప్రారంభించిన ఇడి మరో కేసులో రాబర్ట్ వాద్రాను విచారించిన ఇడి
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కే సులో కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీ, రా హుల్ గాంధీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మంగళవారం చార్జీషీటు దాఖలు చేసింది. కాంగ్రెస్ ఓవర్ సీస్ యూనిట్ చీఫ్ శామ్ పి ట్రోడా, సుమన్ దూబే తో సహా మరికొందరు ముఖ్యనేతల పేర్లను కూడా చార్జిషీటులో పే ర్కొంది. సోనియా, రాహుల్, ఇతర నాయకు లు, యంగ్ ఇండియన్ అనే ప్రైవేటు కంపెనీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు మనీలాండరింగ్ కు పాల్పడ్డారని, నేరపూరిత కుట్ర పన్నారని ఫిర్యాదులో ఆరోపించింది. కే సు తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీ చేపట్టనున్నట్లు స్పెషల్ కోర్టుతెలిపింది. ఈడీ చర్య పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేంద్రప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్ష నాయకులను బెదిరించడానికి ప్రభుత్వ ఏజెన్సీలను వాడుకుంటున్నారని ఆయన దుయ్యపట్టారు. ఏప్రిల్ 11న ఈడీ ఢిల్లీ, ముంబై లక్నోలోని పలు ఆస్తుల రిజిస్టార్‌లకు నోటీసులు జారీ చేసింది. అసోసియే ట్ జర్నల్స్ లిమిటెడ్‌కు
చెందిన ఆస్తులు ఇవి. వీటిని యంగ్ ఇండియన్ లిమిటెడ్ సంస్థ సేకరించింది. ఈ కంపెనీ ముఖ్యంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీల యాజమాన్యంలో ఉంది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన ఈ ఆస్తుల విలువ 988 కోట్ల రూపాయలు. మనీలాండరింగ్ పాల్పడడం ద్వారా ఈ ఆస్తులు సేకరించినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. కాగా ఒక అడ్జుడికేటింగ్ అథారిటీ ఆస్తుల అటాచ్ మెంట్ ను ధ్రువీకరించిన తర్వాత ఈడీ ఈ చర్యలు ప్రారంభించింది. 2014 లో బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా 2021లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తు చేపట్టింది. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కు చెందిన దాదాపు రూ.2 వేల కోట్ల ఆస్తిని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే సంస్థ నామమాత్రంగా 50 లక్షలరూపాయలకు మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారన్నది ఆరోపణ.