- Advertisement -
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో సుమన్ దూబేతోపాటు ఇతరుల పేర్లు కూడా ఉన్నాయి.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సబంధించిన మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ విదేశీ చీఫ్ సామ్ పిట్రోడాపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు దాఖలు చేసింది. దీంతో ఈ కేసుపై ఏప్రిల్ 25న కోర్టులో విచారణ జరగనుంది. ఇరు వర్గాల వాదనలు న్యాయస్థానం విననుంది. కాగా, ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది.
- Advertisement -