భూమి కోసం ఉద్యోగం కుంభకోణం కేసులో మాజీ రైల్వే మంత్రి , ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోషాక్ తగిలింది. లాలూతోపాటు ఆయన తనయుడు తేజస్వి, మరో ఎనిమిది మందిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈమేరకు 96 పేజీల డాక్యుమెంట్లను ఢిల్లీ కోర్టులో స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నేకు సమర్పించింది. దీనిపై ఆగస్టు 13న వాదనలు వింటారు.
సిబిఐ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తరువాత ఇడి సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయడమైంది. లాలూప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా 2004 నుంచి 2009 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో రైల్వే వెస్ట్‌సెంట్రల్ జోన్‌లో గ్రూప్ డి ఉద్యోగాల నియామకాలు జరిగాయి. ఉద్యోగంలో నియామకం పొందిన వారు భూమిని బహుమానంగా లాలూ ప్రసాద్ కుటుంబం పేరున లేదా వారి సహచరుల పైన అందజేయడమైందని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసును దాఖలు చేసింది.