Thursday, January 23, 2025

గొర్రెల స్కామ్ పై ఇడి నజర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కాం కేసులో విచారణకు ఇడి రంగంలోకి దిగింది. ఈ కేసులో రూ. 700 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు రా వడం తో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్‌ఎ) కింద ఇడి విచారణ చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. ఈ చట్టం కింద ఇసిఐఆర్‌ను ఇడి నమోదు చేసింది. ఈ సందర్భంగా మ నీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఏ) కింద దీనిపై విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో పాటు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గొ ర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండికి ఇడి లేఖ రాసిం ది. గొర్రెల పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలని ఆ సంస్థను ఆదేశించింది. గొర్రెల కొనుగోళ్ల కోసం ఏ యే జిల్లాలో ఏ అధికారి ఖాతాలో డబ్బుజమైంది..? ఎంత జమ చేశారు…? తదితర వివరాలను ఇవ్వాలని సూచించింది. దీం తోపాటు గొర్రెల ర వాణా కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాల గురిం చి కూడా ఇవ్వాలని ఇడి ఈ లేఖలో కో రింది.

ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్, ఫోన్ నంబర్లు, వారి బ్యాంకు ఖాతాల వివరాలు, వారి చెల్లించిన డిడిల సమాచా రం, వాటి తాలుకూ బ్యాంకు వివరాలను కూడా ఇవ్వాలని ఇడి ఆ లేఖలో సూచించింది. వీరితో పా టు గొర్రెలు అమ్మిన వారి వి వరాలు, వారి పేర్లు, వారికి చెల్లించిన బ్యాంకు వివరాలను కూడా ఇవ్వాలని ఇడి పేర్కొంది. దీం తోపాటు జిల్లాల వారీగా గొర్రెల రవాణాకు ఉపయోగించిన వా హనాలు, ఆయా వాహనాల నెంబర్‌లతో పాటు గొర్రెల మేత కోసం వాడిన
దాణా, ఆ దాణా ఎవరి దగ్గరి నుంచి కొనుగోలు చేశారు, జిల్లాల వారీగా వివరాలను, వారికి చెల్లించిన బ్యాంకు వివరాలను పేర్కొనాలని ఇడి తెలిపింది. ఇవన్నీ అందజేయాలని ఆదేశిస్తూ ఇడి లేఖ రాయడం ప్రస్తుతం తెలంగాణలో సంచలనం సృష్టించింది.

ఇప్పటికే పదిమంది నిందితులను గుర్తించిన ఎసిబి…
పశుసంవర్థకశాఖ మాజీ ఎండి రాంచందర్ నాయక్, అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌లపై ఏసిబి కస్టడీ విచారణ కొనసాగుతుండగా గొర్రెలను అమ్మిన వారికి కాకుండా ఇతర బినామీ ఏజెన్సీల వివరాల గురించి కూడా ఇడి ఆరా తీస్తోంది. గొర్రెలను అమ్మిన వారికి కాకుండా ఇతర బినామీ లకు డబ్బులను ఎందుకు బదలాయించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు ప్రస్తుతం ఏసిబి కస్టడీలో ఉన్న అధికారులు జవాబు ఇవ్వలేదని సమాచారం.మరోవైపు గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందన్న ఏసిబి అధికారులు ఈ కేసులో పది మంది నిందితులను గుర్తించారు.
రూ. 700 కోట్ల అవినీతి..
కాగా, తెలంగాణలో గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని ఏసిబి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గొర్రెల కొనుగోలు వ్యవహారంపై ఇడి ఫోకస్ పెట్టింది. ఎసిబి కేసు ఆధారంగానే ఇడి దర్యాప్తు ప్రారంభించనుంది. గొర్రెల పంపిణీలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇడి రంగంలోకి దిగడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News