Friday, December 20, 2024

నా వాంగ్మూలాలను ఇడి ఫోర్జరీ చేసింది: రామచంద్ర పిళ్లై

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై తన వాంగ్మూలాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఫోర్జరీ చేసిందని, బలవంతంగా తన చేత సంతకాలు పెట్టించిందని ఆరోపిస్తూ సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రత్యేక జడ్జి ఎంకె నాగ్‌పాల్ ఇడికి నోటీసు జారీ చేశారు. మార్చి 13లోగా పిళ్లై పిటిషన్‌పై జవాబును దాఖలు చేయాలని ఇడిని జడ్జి ఆదేశించారు.

పిళ్లై కోర్టులో శుక్రవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇడి ఎదుట నమోదు చేసిన వాంగ్మూలాలను వాపసు తీసుకోవడానికి అనుమతించాలని పిళ్లై తరఫు న్యాయవాది జడ్జిని కోరారు. రెండు డాక్యుమెంట్లపై సంతకాలు చేయాలని ఇడి తను ఒత్తిడి చేసిందని, వాటినే తన వాంగ్మూలాలుగా కోర్టులో ప్రవేశపెట్టిందని పిళ్లై ఆరోపించారు. మార్చి 6న పిళ్లైని ఇడి అరెస్టు చేసి మరుసటి రోజున కోర్టులో హాజరుపరిచింది. ఇడి కస్టడీకి పిళ్లైని న్యాయస్థానం పంపించగా మార్చి 13న పిళ్లై ఇడి కస్టడీ ముగియనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News