Wednesday, January 22, 2025

ఈడీ సోదాలు.. వాషింగ్ మిషన్ లో నోట్ల కట్టలు

- Advertisement -
- Advertisement -

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు కంపెనీలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుంది. మంగళవారం క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్ డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామితో పాటు అనుబంధ సంస్థలు, లక్ష్మీటన్ మారిటైమ్, హిందుస్థాన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో రూ.2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంతమొత్తం వాషింగ్‌ మెషిన్‌లో దొరికినట్లు ఈడీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే వివిధ పత్రాలు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

భారతదేశం వెలుపల పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్య లావాదేవీల్లో ఈ సంస్థల ప్రమేయం ఉందని.. సింగపూర్‌కు చెందిన గెలాక్సీ, హారిజన్ అనే రెండు షిప్పింగ్ కంపెనీలకు రూ.1800 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News