Wednesday, January 22, 2025

క్యూనెట్ స్కామ్: 137 కోట్ల నగదు నిల్వలు ఇడి ఫ్రీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్యూనెట్ కుంభకోణంలో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ, దాని ప్రమోటర్లకు చెందిన రూ.137 కోట్ల నగదు నిల్వలను స్తంభింపజేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ యూనిట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిందితులు కలిగి ఉన్న బ్యాంకు ఖాతాలను ఇడి స్తంభింపజేసింది. హైదరాబాద్, బెంగళూరులోని క్యూనెట్ స్కామ్‌కు సంబంధించిన ప్రాంగణాల్లోని పలు ప్రాంతాల్లో ఇడి ఇటీవల సోదాలు నిర్వహించింది. విహాన్, దాని ప్రమోటర్లపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన 38 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇడి 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదికను నమోదు చేసింది.

క్యూనెట్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం తర్వాత ఇడి ఇతర ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ దర్యాప్తును చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా మోసం చేసిన మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ క్యూనెట్ అని ఆరోపణ. క్యూ1 గ్రూప్ యాజమాన్యంలోని హాంకాంగ్ ఆధారిత మల్టీ-లెవల్ మార్కెటింగ్ కంపెనీకి విహాన్ లింక్ చేయబడింది. కంపెనీ అనేక పోంజీ స్కీమ్‌లు మరియు బైనరీ స్కీమ్‌లు, ప్రోడక్ట్ బేస్డ్, వెకేషన్ ప్యాకేజీలు, వ్యాపార వ్యూహాలలో పాల్గొంటున్నట్లు సైబరాబాద్ పోలీసులు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News