Monday, November 18, 2024

డ్రగ్స్ కేసులో నటి ముమైత్‌ఖాన్‌ను విచారించిన ఇడి

- Advertisement -
- Advertisement -
ED interrogates actress Mumaith Khan in drugs case
 7గంటల పాటు సాగిన విచారణ,  బ్యాంకు లావాదేవీలపై ఆరా!

మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ముమైత్‌ఖాన్‌ను బుధవారం నాడు ఇడి అధికారులు దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. ఈక్రమంలో ముమైత్‌ఖాన్‌కు చెందిన రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలకు సంబంధించిన వివరాలు పరిశీలించిన అధికారులు అందులో అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీల గురించి ప్రశ్నించారు. అదేవిధంగా ముంబయిలో రెండు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించిన ఇడి అధికారులు ఆయా బ్యాంకు ఖాతాల ద్వారా గతంలో ఆమె జరిపిన లావాదేవీలపై ఆరా తీశారు. 2017లో ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇడి ముమైత్‌ను విచారించింది. అంతేకాకుండా ఎఫ్ లాంజ్ క్లబ్‌లో జరిగిన ఈవెంట్లు, నగదు లావాదేవీలపై ముమైత్‌ను అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్, జిషాన్‌లతో ముమైత్‌కు నేరుగా సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్ క్లబ్ జీఎం విక్రమ్‌కు ముమైత్‌కు మధ్య జరిగి బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌లను లోతుగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇడి అధికారులు అడిగిన ప్రశ్నలకు ముమైత్ వెంటవెంటనే సమాధానమిచ్చింది. అలాగే ఎఫ్ క్లబ్‌లో జరిగే పార్టీలకు హాజరయ్యారా? మీరు ఎప్పుడైనా మాదకద్రవ్యాలు వినియోగించారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలతో మీకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించారు. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మీతో కలిసి ముమైత్ ఖాన్ నిర్వహించిన పలు వ్యాపారాలపై ఆరా తీశారు. అదేవిధంగా డ్రగ్స్ సరఫరాదారులైన కెల్విన్, వాహిద్‌లతో సంబంధాలపై విచారణ చేపట్టారు.విచారణంలో భాగంగా పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, నవదీప్, రానా దగ్గుబాటి, నందులతో ఉన్న పరిచయాలపైనా ప్రశ్నించారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఇడి అధికారులు ఆదేశించారు. డ్రగ్స్ కేసులో ముమైత్‌ను నాలుగేళ్ల క్రితం ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెను పది గంటల పాటు విచారించారు. ఇప్పుడు తాజాగా ఇడి అధికారులు మనీలాండరింగ్ అంశంపై 7గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News