- Advertisement -
ఢిల్లీ: నిన్న ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. “నాది అక్రమ అరెస్ట్.. నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారు” అని ఎమ్మెల్సీ కవిత కోర్టులో తెలిపారు. నిన్న ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కవిత తరుపున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ఈడీ సంస్థ ఉల్లంఘించిందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని తుంగలో తోక్కి కవితను అరెస్టు చేశారన్నారు. కవితతో 5 నిమిషాలు మాట్లాడేందుకు విక్రమ్ చౌదరి అనుమతి కోరారు. విక్రమ్ చౌదరి విజ్ఞప్తిని న్యాయమూర్తి నాగపాల్ అనుమతించారు. ఈడీ తరుపున ఎన్.కె మట్టా, జోసెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు.
- Advertisement -