Saturday, December 21, 2024

బుచ్చిబాబుతో కలిసి పిళ్లైని విచారించాల్సి ఉంది: ఇడి

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: మద్యం స్కామ్ కేసులో అరుణ్ పిళ్లైని రౌస్ అవెన్యూ కోర్టులో ఇడి హాజరుపరిచింది. పిళ్లైని మూడు రోజుల పాటు ఇడి అధికారులు కస్టడీకి కోరారు. సౌత్ గ్రూప్‌లోని వ్యక్తులను కూడా ప్రశ్నించాల్సి ఉందని ఇడి పేర్కొంది. ఈ నెల 13న బుచ్చిబాబు విచారణకు హాజరవుతారని ఇడి తెలిపింది. బుచ్చిబాబుతో కలిసి పిళ్లైని విచారించాల్సి ఉందని ఇడి వివరించింది. పిళ్లై కస్టడీని మార్చి 15 వరకు పొడిగించాలని ఇడి కోరింది. మద్యం స్కామ్ కేసులో ఇప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను కూడా ఇడి అధికారులు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News