Monday, December 23, 2024

లోన్ యాప్‌లపై ఇడి దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

ED investigation on loan apps

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో యాప్‌లపై ఇడి బుధవారం నాడు రూ.6.17 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న యాప్‌లపై కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అడిగిన వెంటనే రుణమిచ్చేసి ఆపై అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడే యాప్‌ల కారణంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిర్దేశిత గడువు దాటితో రుణం తీసుకున్న వారి బంధువులకు సందేశాలు పంపుతూ అవమానాలకు గురిచేసే యాప్‌లపై పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఇడి దర్యాప్తు చేపడుతోంది. ఈ క్రమంలో అన్‌లైన్ రుణాలు ఇచ్చే యాప్‌లపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఇడి తాజాగా లోన్ యాప్ సంస్థ ఫిన్‌టెక్‌కు చెందిన రూ.6.17 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. అంతేకాకుండా పలు లోన్ యాప్లకు చెందిన ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ఇడి చర్యలు తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News