Sunday, January 19, 2025

మద్యం కుంభకోణం కేసు.. కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2 న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. మొదట నవంబరు 2 న, ఆ తర్వాత డిసెంబరు 21, జనవరి 3, జనవరి 18న , తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే వివిధ కారణాలు చూపి ఆయన వాటిని తిరస్కరించారు. ఈ క్రమం లోనే తాజాగా ఐదోసారి ఆయనను విచారణకు పిలిచింది. ఈ సారి కేజ్రీవాల్ గైర్హాజరైతే అరెస్టు వారెంట్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాలని ఈడీ భావిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News