Monday, December 23, 2024

లాలూ , తేజస్వీలకు ఇడి తాజా సమన్లు

- Advertisement -
- Advertisement -

పాట్నా : భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు భూముల కుంభకోణంలో ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు ఇడి తాజా సమన్లు వెలువరించింది. తేజస్వీ బీహార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు స్థానికుల నుంచి భూములు చవకగా తీసుకుని వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చారనే కేసు చాలాకాలంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు వీరిరువురూ పాట్నాలోని తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని ఇడి తాజా సమన్లలో పేర్కొన్నారు.

ఈ కేసు మనీలాండరింగ్ వ్యవహారంగా విచారణల మీద విచారణలుగా ఉంది. శుక్రవారం ఇడి సమన్లు వెలువరించింది. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ తమ ఎదుట ఈ నెల 29న హాజరుకావాలని ఆదేశించారు. కాగా తేజస్వీని మరుసటిరోజు అంటే 30న విచారించాలని ఇడి నిర్ణయించింది. ఇడి బృందం సమన్లు తీసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సిఎం రబ్రీదేవి నివాసానికి వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి ఇంతకు ముందటి సమన్లను ఈ ఇద్దరూ పట్టించుకోలేదు. విచారణకు హాజరు కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News