Saturday, February 22, 2025

కవితకు ఇడి తాజా సమన్లు: మార్చి 20న హాజరుకావాలని ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్‌ఎస్ నాయకురాలు, ఎంఎల్‌సి కె కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం తాజా సమన్లను జారీచేసింది. మార్చి 20న తమ ఎదుట హాజరుకావాలని ఇడి అధికారులు ఆమెను ఆదేశించారు. కాగా.. గురువారం ఇడి ఎదుట హాజరుకావలసి ఉన్న కవిత వ్యక్తిగతంగా హాజరుకాలేదు. ఆమె తరఫున ఆమె న్యాయవాది ఇడి ఎదుట హాజరయ్యారు. తనకు ఇచ్చిన సమన్లలో వ్యక్తిగతంగా హాజరుకావాలని లేకపోవడంతో తన తరఫున లాయర్‌ను పంపించానని కవిత ఇడికి పంపిన లేఖలో తెలియచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News