Sunday, January 19, 2025

ఇడిది కాదు.. మోడీ నోటీస్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్  : రాజకీయ కక్షతోనే మరోసారి ఈడి నోటీసు పంపిందని ఇందులో ఆందోళన చెందాల్సింది ఏమి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఎల్ఎ క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈడి పంపిన నోటీస్ తాము మోడీ పంపిన నోటీస్‌గానే భావిస్తామన్నారు. ఏడాది కాలంగా విచారిస్తున్నారని ఒక టివి సిరియల్ తరహాలో దర్యాప్తు సాగాదీస్తున్నారని తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున మరో ఎపిసోడ్ తెరపైకి తెచ్చారని కవిత పేర్కొన్నారు.

ఈడి పంపిన నోటీస్ లీగల్ టీంకు పంపానని వారి సూచన మేరకే ముందుకు వెళ్తామన్నారు. దేశ వ్యాప్తంగా కెసిఆర్ ప్రజాధారణ పెరుగుతున్నందు వల్లే మోడీ సర్కారు ఓర్వలేక కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజీకయ కక్షతో నోటీసులు పంపారనేది అందరికి తెలిసిందేనని ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎంఎల్ఎ బిగాల గణేష్ గుప్తా, మేయర్ దండు నీతూకిరణ్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News