Sunday, December 22, 2024

కేజ్రీవాల్‌కు ఇడి మరోసారి సమన్లు జారీ

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి 26న హాజరుకావాలంటు ఆదేశం

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం తాజా సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 26న తమ ఎదుట హాజరుకావాలని ఇడి ఆదేశాలు జారీచేసింది. పిఎంఎల్‌ఎ నిబంధనల కింద ఏడవసారి సమన్లు జారీచేసిన ఇడి ఇందుకు సంబంధించిన కేసు స్థానిక కోర్టు విచారణలో ఉన్నందున తనకు నోటీసులు జారీచేయడం సబ్ జుడిస్ అవుతుందన్న కేజ్రీవాల్ వాదనను ఇడి తోసిపుచ్చింది.

ఫిబ్రవరి 26న తమ ఎదుట హాజరై తన వాండ్మూలాన్ని ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఇడి ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో తాము జారీచేసిన సమన్లను పట్టించుకోనందుకు కేజ్రీవాల్‌పై స్థానిక కోర్టులో ఇడి పిటిషన్ దాఖలు చేసింది. గత వారం వ్యక్తిగత హాజరు నుంచి కేజ్రీవాల్‌కు ఒకరోజు మినహాయింపు ఇచ్చిన స్థానిక కోర్డు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News