కవిత అరెస్ట్‌పై ఎక్స్ వేదికగా స్పందించిన కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : పదేళ్ల బిజెపి పాలనలో రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం చేయడం సర్వసాధారణంగా మారిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఎంఎల్‌సి కవిత అరెస్ట్‌పై ఎక్స్ వేదికగా కెటిఆర్ స్పందించారు. శుక్రవారం ఇడి ప్రదర్శించిన తొందరపాటు దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
కవిత అరెస్టు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇడి వ్యవహరించిన తీరుపైన రేపు సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలిపారు. కచ్చితంగా 19వ తేదీన జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకి వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇడి స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్)ను తుంగలో తొక్కి శుక్రవారం కవితను అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని వ్యాఖ్యానించారు. కచ్చితంగా న్యాయం గెలుస్తుందని, చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Abuse of power and institutional misuse to settle political scores is something that has become increasingly common with BJP Govt in last 10 years
ED needs to answer Supreme Court on the inordinate rush to arrest when the matter is very much sub-judice & up for review in a…
— KTR (@KTRBRS) March 15, 2024