Sunday, January 5, 2025

మరింత గడువు కావాలి

- Advertisement -
- Advertisement -

 ఈ కార్ రేసు విచారణలో ఇడిని కోరిన ఐఎఎస్ అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండిఎ
రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి నేటి విచారణకు రెడ్డి గైర్హాజరు 8న
వస్తానని దర్యాప్తు సంస్థకు మెయిల్ 9న వస్తానన్న అర్వింద్‌కుమార్
అంగీకరించిన ఇడి ఈలోగా కెటిఆర్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వస్తుందన్న
ఆశతోనే గడువు కోరినట్లు సమాచారం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడి విచారణకు హెచ్‌ఎండిఎ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి గురువారం గైర్హాజర్ అ య్యారు. తనకు మరికొంత సమయం కావాలని ఈ నెల 8వ తేదీన విచారణకు వస్తానని ఆయన ఈడికి మెయిల్ ద్వారా తెలియజేశారు. అలాగే శు క్రవారం ఈడి విచారణకు హాజరు కావాల్సిన ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ కూడా తాను ఈ నెల 9న హాజరుకానున్నట్టు ఈడి అధికారులకు మెయిల్ పంపించారు. వీరి విజప్తికి ఈడి కూడా సానుకూలంగా స్పందించింది. ఇదే కేసులో ఈడి నుంచి సమన్లు అందుకున్న ఎ1 నిందితుడు, మా జీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్ ఈ నెల 7న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన హాజరు కూడా అనుమానమేనని అంటున్నారు. ఇదే కేసు లో తనపై ఎసిబి నమోదు చేసిన కేసు అక్రమమని కెటిఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో తీ ర్పును హైకోర్టు రిజర్వు చేసిన విషయం తెలిసిం దే. ఈ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతోనే గురు, శుక్రవారాలలో ఈడి విచారణకు బిఎల్‌ఎన్ రెడ్డి , అర్వింద్‌కుమార్ గైరాహజర్ అయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

ఈ కార్ రేసు ఉదంతంలో తనపై ఎసిబి నమోదు చేయడం, దాని ఆధారంగా ఈడి కూడా కేసు న మోదు చేయడాన్ని కెటిఆర్ హైకోర్టులో సవాల్ చే యగా, ఆయన తరఫున హైకోర్టులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో అసలు అవినీతే జరగలేదన్నది కెటిఆర్ వాదన. ఈ రేస్ పై 14 నెలలు తర్వాత కేసు పెట్టారని, ఇది పూర్తిగా రాజకీయ క క్షగా ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో వా దించగా, ప్రభుత్వం తరఫున ఎజి సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని, ఈ సమయంలో అడ్డుకోవడం సరికాదని ఎజి హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఇరు పక్షాల వాదనల తర్వాత క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో పాటు తీర్పు వెల్లడించే వరకు కెటిఆర్‌ను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న అంచనాతోనే ఈ కేసులో ఎ౩ బిఎల్‌ఎన్ రెడ్డి, ఎ2 అర్వింద్‌కుమార్ ఈడి విచారణకు హాజరు కాకుండా గడువు కోరినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ-కార్ రేసు పై ఎసిబి పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేస్తే, అప్పుడు ఈడి పెట్టిన కేసు కూడా ఉండదని బిఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్‌కుమార్ ధీమాగా ఉన్నట్టు తెలిసింది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు ఈడి నోటీసు
ఈ కార్ -రేస్ నిర్వహణకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థకు నేరుగా రూ. 45.71 కోట్లను యుకె కరెన్సీని పౌండ్ల రూపంలో బదిలీ చేసిన వ్యవహారం పై ఇడి ఆరా తీస్తోంది. ఈ కారు రేస్ నిర్వహణ లో ఆర్థిక లావాదేవీలలో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తాజాగా ఈడి తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు నిధులను బదిలీ చేసిన హైదరాబాద్ హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీన్ బ్యాంక్‌కు కూడా ఈడి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారనే కోణంలో ఈడి ఆరా తీస్తోన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News