బెంగళూరు : మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) భూకేటాయింపుల అవకతవకలపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సతీమణి బిఎం. పార్వతి, కర్నాటక మంత్రి బైరతి సురేశ్‌లకు మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. వారు బెంగళూరులోని శాంతినగర్‌లోని ఈడి ప్రాంతీయ కార్యాలయానికి హాజరుకావలసి ఉంటుంది. ‘అవును, నా భార్యకు నోటీసులు జారీ అయ్యాయి’ అని సిఎం సిద్దరామయ్య ధృవీకరించారు. బెంగళూరులోని శాంతినగర్ ఈడి కార్యాలయానికి మంగళవారం హాజరు కావాలని పార్వతికైతే ఆదేశాలు అందాయి. కానీ పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ మంత్రి సురేశ్‌కు సమన్లు అందాయా లేదా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. ముడా కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగంపై ఈడి దర్యాప్తు చేస్తోంది. ఇందులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలకి అనుమానితుడు. రూ. 300 కోట్ల విలువచేసే స్థిరాస్తులను ఇటీవల ఈడి జప్తు చేసుకుంది. కాగా భూ కేటాయింపుల కుంభకోణంలో దర్యాప్తు జరిపిన కర్నాటక లోకాయుక్త తన రిపోర్టును నేడు(సోమవారం) కర్నాటక హైకోర్టుకు సమర్పించింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నాటక సిఎం సిద్దరామయ్య సతీమణికి ఈడి నోటీసు!
- Advertisement -
- Advertisement -
- Advertisement -