Thursday, January 23, 2025

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. ఢిల్లీకి రావాలని ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 09 తేదీన ఢిల్లీకి రావాలని నోటీసుల్లో తెలిపింది. తాను కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్రపిళ్లై ఒప్పుకున్నారని ఈడీ పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో గతంలో సిబిఐ కవితను విచారించింది. గతేడాది డిసెంబర్ 11న కవితను ఇంటి వద్ద సిబిఐ దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించిన ముచ్చట తెలిసిందే. అటు మార్చి 10 మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ లో కవిత దీక్ష చేపట్టనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News