Tuesday, November 5, 2024

20న విచారణకు రావాల్సిందే: కవితకు మరోసారి ఈడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. వారిని సిబిఐ, ఈడి అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో మరోసారి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నోటీసులు జారీ చేసింది. ఈనెల 20వ తేదీన వ్యక్తి గతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు వెల్లడించింది. అయితే అసలు గురువారం ఇడి ఎదుట ఎంఎల్‌సి కవిత దర్యాప్తులో భాగంగా హాజరుకావాల్సి ఉంది. ఈనెల 11న దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు కవితన విచారించిన విషయం తెలిసిందే. ఈనెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని అదే రోజున నోటీసులు జారీ చేశారు.

అయితే తాను హాజరుకాలేనని ఈ మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు కవిత లేఖ పంపారు. మరో రోజున విచారణకు హాజరు అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విచారణకు హాజరుకాలేనని ఇడికి కవిత సమాచారం అందించగా ఇడి అడిగిన పత్రాలను న్యాయవాది ద్వారా ఆమె పంపించారు. ఈడికి మరో లేఖ రాస్తూ ఆడియో, వీడియో విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. అధికారులు తన నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చని కోరారు. తన ప్రతినిధిగా తన న్యాయవాది భరత్‌ను ఇడికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మరో తేదీని ఖరారు చేస్తూ కవితకు ఇడి నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎంఎల్‌సి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ కేసును ఆమె తరఫు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించి అత్యవసర విచారణ చేపట్టాలని కోరినా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే విచారణ చేపట్టడానికి నిరాకరించారు. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీ వరకు వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News