Wednesday, January 22, 2025

నేషనల్ హెరాల్డ్ కేసులో అంజన్ కుమార్ యాదవ్‌కు ఇడి నోటీస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ఇడి అధికారులు మంగళవారం నోటీసులు పంపారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సదరు నోటీసులో ఇడి పేర్కొంది. 2022 నవంబర్ 23న అంజన్ కుమార్ యాదవ్ ఇడి విచారణకు హాజరైన విషయం విదితమే. ఈ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఇడి విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి ఇడి విచారణకు హాజరు కావాలని అంజన్ కుమార్ యాదవ్‌కు ఇడి నోటీసులు పంపింది నేషనల్ హెరాల్డ్ కేసులో గత ఏడాది లో ఇడి విచారణకు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. మాజీ మంత్రి గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఇడి విచారణకు హాజరయ్యారు.

రూ.2 వేల కోట్ల విలువైన అసెట్స్, ఈక్విటీ లావాదేవీల విషయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక సహాయం అందించింది. మరోవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో అవకతవకలు జరిగాయని బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. కేవలం రూ. 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను రికవరీ చేసుకునే హక్కును పొందిందని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News