Sunday, December 22, 2024

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ను ఇడి అధికారులు అరెస్టు చేశారు. డిల్లీ లిక్కర్ కేసులో గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన నివాసంలో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. సెర్చ్ వారెంట్ నోటీసులు ఇచ్చి రెండు గంటలపాటు సోదాలు జరిపిన ఇడి అధికారులు.. అనంతరం కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. ఇడి సోదాలు నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసం దగ్గరకు పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు చేరుకుని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆప్ నాయకులు, కార్యకర్తుల రావడంతో ఆయన నివాసం భారీగా పోలీసులు మోహరించారు. దీంతో కేజ్రీవాల్ ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక, కేజ్రీవాల్ అరెస్టును ఆప్ మంత్రులు, ఇండియా కూటమి నేతలు ఖండించారు. ప్రతిపక్షాలను భయపెట్టేందుకే కేజ్రీవాల్ ను అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు మోడీ పాల్పడుతున్నాడని ఆప్ మంత్రి అతిషీ విమర్శించారు. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని ఆమె తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News