Monday, December 23, 2024

కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు (వీడియో)

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఢిల్లీకి తరలిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు చేేసినట్లు కవితకు ఈడీ అధికారులు మెమో ఇచ్చారు. కవితను సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది. అరెస్టుకు కారణాలను 14 పేజీల్లో విరిస్తూ కవితకు మెమో ఇచ్చామని తెలిపింది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కు ఈడీ సమాచారం ఇచ్చింది. మనీలాండరింగ్ చట్టం సెక్షన్ -3 కింద కవిత నేరానికి పాల్పడ్డరని ఈడీ స్పష్టం చేసింది.

శుక్రవారం రాత్రి 8.55కి అధికారులు శంసాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్‌ బుక్‌ చేశారు. కవితను తీసుకెళ్లే రూట్‌ ను పోలీసులు క్లియర్‌ చేశారు. కవిత ఇంట్లో మధ్యాహ్నం నుంచి సోదాలు కోనసాగుతున్నాయి. కవిత అరెస్ట్ నేపథ్యంలో బిర్ఎస్‌ కార్యకర్తల హెచ్చరికతో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీకి వ్యతిరేకంగా బిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కవిత ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. అక్రమ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా ఎదుర్కొంటానని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News