ముంబై: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులు నేడు శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇంటిని సోదా చేశారు. పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో ఆదివారం ఉదయం ఈ సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ఈడి ఆయనకు రెండు సార్లు నోటీసులు జారీచేసింది. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. జూలై 27న ఈడి కార్యాలయానికి రావాలని కోరగా..పార్లమెంటు సమావేశాల కారణంగా రాలేనని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. కాగా ఈడి అధికారుల సోదాలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరించారు. “ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే…నేనెవరికీ తలొగ్గను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహేబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. ఎలా పోరాడాలో బాలాసాహెబ్ మాకు నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా” అని ఆయన ట్వీట్ చేశారు. పత్రాచాల్ కుంభకోణంతో ఆయన సతీమణి వర్షా రౌత్‌కు చెందిన రూ. 11.15 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది. రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
"Sanjay Raut ji is duty bound to attend the parliament and has asked the ED for cooperation. You have witnessed that the ED or the "Extended Department" of the BJP has been hounding opposition leaders and members" says Smt.@priyankac19 to @IndiaToday pic.twitter.com/vHc2hdz1Vw
— Office Priyanka Chaturvedi🇮🇳 (@Priyanka_Office) July 31, 2022