Friday, November 15, 2024

రెండోరోజు 9 గంటలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్‌పై ఇడి ప్రశ్నల పరంపర

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికి 19 గంటల పాటు విచారణ
నేడూ హాజరుకు అధికారుల ఆదేశం
కాంగ్రెస్ నేతల నిరసనలు, అరెస్టు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) విచారణ రెండో రోజు కూడా సుదీర్ఘంగా కొనసాగింది. దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు రాహుల్‌ను విచారించారు. సోమవారంతో కలుపుకొని రెండు రోజుల్లో ఇడి అధికారులు రాహుల్ ను దాదాపు 19 గంటలు ప్రశ్నించారు. అయి తే విచారణ ఇంకా పూర్తి కానందున బుధవారం కూడా విచారణకు రావాలని ఇడి అధికారులు రాహుల్ గాంధీని ఆదేశించారు. దీం తో ఆయన బుధవారం కూడా విచారణకు హా జరు కానున్నారు. మంగళవారం ఉదయంనుంచి విచారించి వాంగ్మూలం నమోదు చేసిన ఆధికారులు ఆయనకు దాదాపు గంట సేపు విరామం ఇచ్చారు.

ఆ తర్వాత మళ్లీ విచారణ మొదలైంది. ఉదయం 11.05 గంటలకు సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ ఇడి కార్యాలయానికి రాగా దాదాపు 4 గంటలపాటు విచారణ జరిపిన అనంతరం విరామం ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం 3.45 గంటలకు రాహుల్ ఇడి కార్యాలయంనుంచి బైటికి వచ్చారు. అనంతరం సాయంత్రం 4.45 గంటలకు రాహుల్ తిరిగి ఇడి కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ తిరిగి ఇడి కార్యాలయానికి చేరుకోగానే విచారణ మొదలైనట్లు తెలుస్తోంది. సోమవారం దాదాపు 10 గంటల పాటు విచారించి రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఇడి అధికారులు మంగళవారం కూడా హాజరు కావాలని సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఉదయం తన నివాసంనుంచి కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్న రాహుల్ అక్కడినుంచి ఇడి కార్యాలయానికి వెళ్లారు.

కాంగ్రెస్ నేతల నిరసనలు, అరెస్టు

ఇదిలా ఉండగా రాహుల్ గాంధీపై ఇడి విచారణను నిరసిస్తూ కాంగ్రెస్‌శ్రేణులు రెండో రోజు కూడా ఢిల్లీలో ఆందోళనలు జరిపాయి. జన్‌పథ్ వద్ద నిరసనలు తెలిపిన ఆ పార్టీ సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌధరి, గౌరవ్ గొగోయ్, దీపేందర్ సింగ్ హూడా,రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని బాదార్‌పూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిరసనల్లో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోట్, భూపేశ్ బాఘెల్ కూడా పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News