Friday, December 20, 2024

అనారోగ్యమైతే ప్రచారం ఎలా చేశారు ?

- Advertisement -
- Advertisement -

కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఈడీ
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం రెగ్యులర్ బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ మరో పిటిషన్ వేశారు. వీటిపై జరిగిన వాదనల్లో భాగంగా, ఆయన అభ్యర్థనలను ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల వేళ విస్తృత ప్రచారం నిర్వహించకుండా ఆయన ఆరోగ్యమేమీ అడ్డంకిగా మారలేదని వెల్లడించింది. మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టయిన సంగతి తెలిసిందే.
తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండడంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సుప్రీం కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ లిస్టింగ్‌కు బుధవారం సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని వెల్లడించింది. దాంతో తాజాగా ఆయన ఢిల్లీ కోర్టుకు వెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ విషయంలో ఈ శనివారం కల్లా స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News