Thursday, January 23, 2025

సోనియాకు ఇడి 4 వారాల గడువు

- Advertisement -
- Advertisement -

ED postpones Sonia questioning for 4 weeks

 

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హాజరు కావడానికి తనకు కొంత సమయం కావాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వినతిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమ్మతించింది. తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు జులై చివరిలో సోనియా గాంధీ హాజరుకావాలని ఇడి ఆదేశించినట్లు అధికారులు గురువారం తెలిపారు. జూన్ 23న హాజరుకావాలని ఇడి రెండవ సారి సమన్లు జారీ చేయగా కొవిడ్, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు కచ్ఛితమైన సూచనలు ఇచ్చారని, అందువల్ల తాను ఆ రోజు ఇడి ఎదుట హాజరుకాలేనంటూ 75 ఏళ్ల సోనియా ఇడికి తెలియచేశారు. దీంతో..ఈ కేసులో సోనియా గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియను ఇడి నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. జులై చివరి వారంలో తమ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని సోనియా గాంధీకి ఇడి తాజాగా తెలియచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News