ఇడి ఎదుటకు కెల్విన్, అతడి సమక్షంలోనే నందుపై విచారణ
నలుగురి ఖాతాల నుంచి
విదేశాలకు నగదు తరలింపుపై
ఆరా, తారల అకౌంట్ల నుంచి
కెల్విన్, ఖుదూస్, జిఖాన్‌ల
ఖాతాలకు నగదు, మనీలాండరింగ్ జరిగినట్టు
గుర్తింపు?, కెల్విన్ స్టేట్‌మెంట్‌ను
రికార్డు చేసిన ఇడి
మనతెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నలుగురి బ్యాంక్ ఖాతాల నుండి విదేశాలకు భారీగా డబ్బు తరలినట్లు ఇడి అధికారుల విచారణలో తేలింది. ఈక్రమంలో 2017 డ్రగ్స్ కేసుకు సంబంధించి మంగళవారం నాడు నటుడు నందు, కెల్విన్, కుధూస్‌లను ఇడి అధికారులు దాదాపు 8 గంటలుగా విచారించారు. ఇడి అధికారులిచ్చిన నోటీసుల ప్రకా రం విచారణకు హాజరైన నందు నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు ఇడి అధికారులు ఒక ప్రశ్నావళిని రూపొందించారు. ఈ మేరకు నందును ప్రశిస్తున్న సమయంలోనే కేసులోని కీలక నిందితుడైన కెల్విన్‌ను భారీ భద్రత మధ్య ఇడి కార్యాలయానికి తీసుకొచ్చారు. నటుడు నందు బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన ఇడి అధికారులు అనుమానాస్పద లావాదేవీలపై కెల్విన్‌ను ఎదురుగా కూర్చొబెట్టి విచారించారు.
2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్ధూస్, జీషాన్ లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను నుండి విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్టుగా కీల క ఆధారాలను ఇడి అధికారులు సేకరించారు. సినీ తారల బ్యాంక్ ఖాతాల నుండి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీశాన్‌ల ఖాతాలకు మధ్య లావాదేవీలు జరిగినట్టు తేలింది. వీటి ఆధారంగా డ్రగ్స్ కేస్ లో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించారు. కెల్విన్‌తో పాటు కుధూస్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇడి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరైన కెల్విన్‌తో పాటు అతని స్నేహితులు పాతబస్తీకి చెందిన కుదూస్, వాహిద్‌లను కూడా విచారించారు. ఇందులో భాగంగా కెల్విన్ బ్యాంక్ లావాదేవా లు, డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు సినీ ప్రముఖులతో కెల్విన్‌కి సంబంధాలపై ఆరా తీశారు.
కెల్విన్ ఇంట్లో ఇడి సోదాలు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ ఇంట్లో ఇటు ఇడి అధికారులు, ఇటు సిఆర్‌పిఎఫ్ పోలీసులు మంగళవారం నాడు సం యుక్తంగా సోదాలు నిర్వహించారు. విచారణకు రావాల్సిందిగా ఇడి నోటీసులు పంపడంతోదానిపై సంతకం చేసేందుకు కెల్విన్‌నిరాకరించాడు. ఈ క్రమంలో నోటీసులపై సంతకం చేసి విచారణకు వెళ్లాలని కెల్విన్ భార్య సూచించడంతో ఇడి అధికారులకు సహకరించాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2:10గంటలకు కెల్విన్‌ను ఇడి కార్యాలయానికి తరలించారు. మరోవైపు కెల్విన్ ఇంట్లో సిఆర్‌పిఎఫ్ సిబ్బందితో పాటు ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలు సోదాలు నిర్వహించిన అధికారులు కెల్విన్‌కు చెందిన ల్యాప్‌టాప్‌తో పాటూ మొబైల్, కొంత నగదును స్వా ధీనం చేసుకున్నారు. నగరంలోని మెహదిపట్నంకు చెందిన మరో నిందితుడు కుదూస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత ని ఇంట్లో రెండు మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బోయిన్‌పల్లి కేసులో సమన్లు
బోయిన్‌పల్లి కేసులో డ్రగ్స్ విక్రేత కెల్విన్‌పై హైదరాబాద్ సిసిఎస్ పో లీసులు మంగళవారం నాడు అభియోగపత్రాలు దాఖలు చేశారు. 2016లో బోయిన్‌పల్లి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి ఎల్‌ఎస్‌డి రకం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాల మేరకు కెల్విన్‌పై 2016 ఆగస్టులో బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో పోలీసులు కెల్విన్‌ను లోతుగా ప్రశ్నించకపోవడంతో పాటు సకాలంలో చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడం తో బెయిల్‌పై విడుదలయ్యాడు. తరువాత కొద్దికాలానికే ఎక్సైజ్ పోలీసులు కెల్విన్‌ను అరెస్ట్ చేయడం, విచారణలో టాలీవుడ్ నటుల డ్రగ్స్ వ్యవహారం వెలుగచూడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తరువాత సిసిఎస్‌లోని నార్కొటిక్స్ విభాగం ఇటీవల నాంపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు అక్టోబరు 11న విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
స్టేట్‌మెంట్ రికార్డ్
డ్రగ్స్‌కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరైన పూరిజగన్నాధ్, చా ర్మి, రకుల్‌ప్రీత్‌సింగ్, నందులతో పాటు ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్ స్టేట్‌మెంట్‌ని ఇడి అధికారులు రికార్డ్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా నటుడు రానాపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. కెల్విన్ కాల్ డేటా, అతని బ్యాంక్ స్టేట్‌మెంట్లు. అతనితో ట్రాన్జాక్షన్స్ నిర్వహించిన సినీ ప్రముఖులందరి డేటానూ ఇడి అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే నోటీసులు ఇచ్చిన టాలివుడ్ తారలు బ్యాంక్ లావాదేవీల చిట్టా తీసుకురమ్మని ఆదేశిస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో నటుడు నందు షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న నం దు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే నందు తనకు షూ టింగ్ ఉన్నదని, అందుకని ముందుగా విచారించాలని నందు అధికారులను కోరడంతో ఇడి అధికారులు సానుకూలంగా స్పందించి మం గళవారం నాడు హాజరుకావాలని నోటీసులిచ్చారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బుధవారం నాడు ముమైత్ ఖాన్, నటుడు రాణాను విచారించన్నుట్లు ఇడి అధికారులు పేర్కొన్నారు.