Wednesday, January 22, 2025

నేషనల్ హెరాల్డ్ కేసులో ఖర్గేను ప్రశ్నించిన ఇడి

- Advertisement -
- Advertisement -

ED questioning Kharge in National Herald case

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తులో భాగంగా రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాడు ప్రశ్నించింది. కొన్ని అంశాలపై అవగాహన కోసం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఎ) కింద ఖర్గే స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కేసుపై సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.

కేవలం రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా కాంగ్రెస్ నేతలు మోసపూరితంగా వ్యవహరించడంతోపాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రయల్ కోర్టులో ప్రైవేట్ క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఇందులో సోనియా గాంధీ , రాహుల్, సహా ఏడుగురి పేర్లను చేర్చారు. స్వామి ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.

యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లో ఖర్గే కీలక బాధ్యతలను చేపట్టినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఈ కేసుకు సంబంధించి హర్యానాలో రూ. 64 కోట్ల విలువైన ఆస్తిని ఈడీ అటాచ్ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. హర్యానా లోని పంచ్‌కులలో ప్లాట్‌ను ఏజెఎల్‌కు అప్పటి సిఎం భూపీందర్ సింగ్‌హుడా చట్టవిరుద్ధంగా కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News