- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజూ విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. ఈడీ అధికారులు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇందుకు నిరసనగా రెండో రోజూ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టింది. దీక్షలో రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు కూర్చున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏఐసిసి కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాగా నిన్న 10గంటలకు పైగా రాహుల్ ను ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -