Wednesday, January 22, 2025

లాటరీ కింగ్ మార్టిన్‌పై ఇడి పంజా

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో లాటరీ కింగ్ శానిటియాగో మార్టిన్ నివాసాలు అనేకంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులకు దిగింది. చెన్నై కేంద్రంగా చేసుకని మార్టిన్ తమ లాటరీ వ్యాపారం సాగించారు. ఆయనపై పలు రకాల మనీలాండరింగ్ వ్యవహారాల కేసులు దాఖలు అయ్యాయి. వీటిని విచారించే క్రమంలోనే ఆయనకు చెందిన పలు నివాసాల్లో ఇడి అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. చైన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. రాజకీయ పార్టీలకు మార్టిన్ ఒక్కడే అత్యధిక స్థాయిలో రూ 1300 కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు అందించడం సంచలనానికి దారితీసింది.

ఇడి ఇప్పటికే గత ఏడాది ఈ వ్యక్తికి చెందిన రూ 457 కోట్ల విలువైన ఆస్తులను ఆటాచ్ చేసింది. కేరళలో అక్రమ రీతిలో లాటరీల విక్రయాలతో మార్టిన్ సిక్కిం ప్రభుత్వానికి రూ 900 కోట్లకు పైగా నష్టం కల్గించాడనేది కీలక అభియోగంగా ఉంది. తమిళనాడులో లాటరీ కింగ్‌గా మార్టిన్‌కు 2019 నుంచి పేరుంది. ఆయనకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ తరఫున సిక్కిం లాటరీల పంపిణీ జరిగింది. ఆయనకు చెందిన సంస్థ పెద్ద ఎత్తున రాజకీయ చందాలు అందించిన క్రమంలో ఈ వ్యవహారం వెనుక ఉన్న ఆర్థిక అక్రమ లావాదేవీలపై ఇడి నిశిత పరిశీలన తరువాత దర్యాప్తు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News