హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని మంత్రి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌లోని పొంగులేటి ఫాంహౌస్, ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. 16 బృందాలుగా డిల్లీ నుంచి వచ్చిన ఇడి అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా నగరంలో 16 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా, ఇటీవల నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దక్కించుకున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణాలపై కాంగ్రెస్ శ్రేణులు, నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ దాడులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏజెన్సీ అధికారులు నిర్వహించిన అంశాలకు సంబంధించినవని తెలుస్తోంది.