Wednesday, January 22, 2025

సూపర్‌టెక్ రియల్ లింక్‌లు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గురుగ్రామ్‌లోని ప్రముఖ రియల్టీ సంస్థ డిఎల్‌ఎఫ్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శనివారం సోదాలు నిర్వహించింది.రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్‌టెక్‌పై దాఖలైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించాల్సి వచ్చిందని ఇడి అధికార వర్గాలు తెలిపాయి. సూపర్‌టెక్, దీని ప్రమోటర్లపై అక్రమ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో డిఎల్‌ఎఫ్ కార్యాలయంలో జరిగిన సోదాల సందర్భంగా కొన్ని పత్రాలు స్వాధీనపర్చుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఇడి వర్గాలు గత కొద్ది రోజులుగా తమ దర్యాప్తును నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇప్పటి సోదాల గురించి వివరణ కోరితే డిఎల్‌ఎఫ్ నుంచి వార్తా సంస్థలకు ఎటువంటి సమాధానం రాలేదు. కేసుకు సంబంధించి ఇడి ఈ ఏడాది జూన్‌లోనే సూపర్‌టెక్ ప్రమోటర్ ఆర్‌కె ( రామ్ కిశోర్ అరోరా)ను అరెస్టు చేశారు. సూపర్‌టెక్ రియల్ ఎస్టేట్ సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడిదార్లను,

ఇళ్ల కొనుగోళ్లదారులను ఆకట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బు గడించిందని, ఈ కోట్లాది రూపాయల నిధులను వివిధ బోగస్ కంపెనీలకు దారి మళ్లించిందని ఇడి ఆరోపిస్తోంది. మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల ఆశలు చూపి సూపర్‌టెక్ సంస్థ , దీని అనుబంధ సంస్థలు ఏకంగా రూ 164 కోట్ల వరకూ రాబట్టుకున్నాయని వెల్లడైంది. ఈ క్రమంలో దాదాపు 670 మంది వరకూ తరువాత మోసపొయ్యారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి ఈ అక్రమాలకు సంబంధించి పలు కేసులు నమోదు దాఖలు అయ్యాయి. పిఎంఎల్‌ఎ పరిధిలో కంపెనీలపై క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి. సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీని 1988లో స్థాపించారు. ప్రత్యేకించి ఢిల్లీ ఎన్‌సిఆర్ పరిధిలో ఈ సంస్థ దాదాపు 80000 అపార్ట్‌మెంట్లు అమ్మింది. ఇప్పటికి ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఈ సంస్థ తరఫున దాదాపు పాతిక వరకూ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ 20000 మందికి పైగా కొనుగోలుదార్లకు గృహాలను స్వాధీనం చేయలేదు. గత ఏడాది నుంచి ఈ సంస్థకు నష్టాలు వాటిల్లుతున్నాయి. నోయిడాలో ఈ సంస్థ నిర్మించిన ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు అమలు కావడంతో సంస్థకు రూ 500 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News