Wednesday, January 22, 2025

శరద్ పవార్ మనవడి కంపెనీలో ఇడి దాడులు

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్‌కు చెందిన బారామతి ఆగ్రో కంపెనీలో శుక్రవారం కేంద్రీయ దర్యాప్తు సంస్థ ఇడి సోదాలు చేపట్టింది. కంపెనీ యాజమానికి రోహిత్ పవార్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మహారాష్ట్ర సహకార బ్యాంక్ స్కామ్‌కు సంబంధించి రోహిత్‌కు చెందిన సంస్థపై ఎసిబి దాడి జరగడం రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. ఈ స్కామ్ వెనుక జరిగిన పలు అక్రమ ఆర్థిక వ్యవహారాలు, మనీలాండరింగ్ సంబంధిత విషయాలపై ఎసిబి స్పందించింది. బారామతి, పుణే, పింప్రి, ఔరంగబాద్‌లలోని ఈ కంపెనీల శాఖలలో ఒకేసారి సోదాలు నిర్వహించారని అధికారులు వెల్లడించారు. బారామతిలోని బారామతి ఆగ్రో కార్యాలయం కూడా ఎసిబి బృందాల తాకిడికి గురైంది.

38 సంవత్సరాల రోహిత్ పవార్ మహారాష్ట్రలోని కర్జాట్ జంకేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్‌సిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. బారామతి ఆగ్రో సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి కూడా ఆయనే . బారామతి ఎంపి సుప్రియా సూలే, స్థానిక ఎమ్మెల్యే , ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌లకు రోహిత్ మేనల్లుడి వరుస అవుతారు. మహారాష్ట్ర సహకార బ్యాంక్ నుంచి రోహిత్ పవార్ తన పలుకుబడిని వాడుకుని భారీగా నిధులు దారిమళ్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. సంబంధిత వ్యవహారంలో బొంబాయి హైకోర్టు గత ఏడాది ఆగస్టులో వెలువరించిన ఆదేశాలతో కొంత మేర దర్యాప్తు జరిగింది. ఈ స్కామ్‌లోనే ఇప్పుడు ఇడి సోదాలకు దిగింది.

ఇది కేవలం రాజకీయదాడే
పవార్ సారధ్య ఎన్‌సిపి విమర్శ
తమ రాజకీయ ప్రత్యర్థుల ప్రజాభిమానం సహించలేక తరచూ బిజపి ఇటువంటి దాడులను కేంద్రీయ దర్యాప్తు సంస్థల ద్వారా సాగిస్తూ ఉంటుందని శరద్ పవార్ సారధ్యపు ఎన్‌సిపి స్పందించింది. రోహిత్ పవార్ సాగించిన యువ సంఘర్ష్ యాత్రకు విశేషాదరణ దక్కడం చూసి ఉడుక్కుని బిజెపి అభద్రతకు గురందని ఎన్‌సిపి ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ఇటువంటి దొడ్డిదారి దాడులతో రోహిత్ పవార్ విజయపథాన్నినిలువరింపజాలరని తెలిపారు. న్యాయవ్యవస్థ అత్యున్నతం, న్యాయం చట్టం వర్థిల్లుతుందని స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News