Monday, December 23, 2024

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బయటపడిన నోట్ల కట్టలు, బంగారం..

- Advertisement -
- Advertisement -

హర్యానాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, విదేశీ ఆయుధాలు బయటపడటం రాజకీయ వర్గాలలో కలకలం సృష్టిస్తోంది.

అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు మాజీ ఎమ్మెల్యే దిల్ బాగ్ సింగ్ నివాసాలపైనా, ఆయన బంధుమిత్రుల ఇళ్లపైనా దాడి చేశారు. గురువారం మొదలుపెట్టిన సోదాలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఇడి ఐదు కోట్ల రూపాయల నగదును, పలు విదేశీ ఆయుధాలను, కాట్రిడ్జెస్ ను స్వాధీనం చేసుకుంది.

కేజీల కొద్దీ బంగారం కూడా లభించింది. దిల్ బాగ్ సింగ్ పై అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తున్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి దిల్ బాగ్ సింగ్ నివాసాలతోపాటు సోనిపట్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వర్ ఇంటిపై కూడా ఇడి దాడులు జరుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News