- Advertisement -
ముంబై: ముంబయిలోని శివసేన కార్పొరేటర్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్టాండింగ్ కమిటీ చైర్మన్ యశ్వంత్ జాదవ్‌కు సంబంధించిన స్థలాల్లో ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే జాదవ్ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బృందం చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కాసేపట్లో వెలువడనున్నాయి. ఇడి అధికారులు ఏ విషయంలో జాదవ్ ఇంట్లో సోదాలు జరిపారన్న విషయంపై స్పష్టత రావాల్సిఉంది. జాదవ్ 1997 నుంచి బిఎంసి కార్పొరేటర్ గా గెలుస్తూ వస్తున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో సభా నాయకుడిగా నియమించబడ్డారు. 2018లో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు యశ్వంత్ జాదవ్.
- Advertisement -