Friday, September 27, 2024

మంత్రి పొంగులేటి ఇంట్లో ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఇడి సోదాలు నిర్వహించింది. హైదరా బాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఇడి సోదాలు జరిపింది. జూబ్లీహిల్స్ పొంగులేటి ఇంటి వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఉంచి సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు, ఏకకాలంలో 16 చోట్ల సోదాలు జరిపాయి. శుక్రవారం ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు జరగ్గా, జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి కుమార్తె నివాసంలోనూ ఇడి సోదాలు నిర్వహిం చింది. పొంగులేటి నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఇడి సోదాలు జరిపింది. హిమాయత్ సాగర్ ఫాంహౌస్‌లో ఇడి తనిఖీలు నిర్వహిం చింది. పది బృందాలుగా విడిపోయి ఇడి సోదాలు నిర్వహించిందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రెండు బృందా లు తనిఖీ చేశాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఇన్ ఫ్రా కార్యాలయాల్లో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు.

కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో 15 బృందాలు తనిఖీలు చేశారు. ఖమ్మంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిలో ఇడి దాడులు చేసింది. ఢిల్లీ జోనల్ అధికారులు తనిఖీలు చేపట్టారని తెలిసింది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి చిన్న వయస్సులోనే బిలియనీర్‌గా మారా రు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. హర్ష రెడ్డి పేరుతో రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇది చర్చానీయాంశం అవుతుంది. ఆ క్రమంలో వరసగా ఈడీ రైడ్స్ జరగడం చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు జరుగుతున్న రైడ్స్ దానికి కొనసాగింపు అని తెలుస్తోంది. అయితే, గత ఎన్నికల సమయంలోను పొంగులేటి ఇంటిపై ఇడి దాడులు నిర్వహించింది. గతంలోనూ ఇడి రైడ్స్ పై పొంగులేటి ముందే ఊహించి చెప్యపారు. ప్రస్తుతం జరుగుతున్న ఇడి రైడ్స్‌పై ఇంకా పొంగు లేటి స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News